బాపట్లలో సీఎం చంద్రబాబు మెగా మీట్ అతిపెద్ద ఫ్లాప్ షో

ఎందుక వచ్చారో... ఎం తెలుసుకున్నారో అర్థంకాని పరిస్థితి

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి

రూ.10 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన మెగా మీట్ ఒక పొలిటికల్ ఈవెంట

చంద్రబాబు పర్యటన వల్ల బాపట్లకు ఒరిగింది శూన్యం

ఆరునెలల్లో విద్యారంగం కోసం చంద్రబాబు చేసింది ఏమీలేదు

తల్లికి వందనంపై చంద్రబాబు ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు

ఫీజురియింబర్స్ మెంట్ బకాయిల విడుదలపై మాట్లాడతారని అనుకున్నారు

కనీసం బాపట్ల మెడికల్ కాలేజీ సమస్యలపై స్పందిస్తారని భావించారు

కేవలం తన భజనకే చంద్రబాబు పరిమితం అయ్యారు

కోన రఘుపతి మండిపాటు

 బాపట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బాపట్లలో ముఖ్యమంత్రి పాల్గొన్న మెగా మీట్ కార్యక్రమం ఒక పొలిటికల్ ఈవెంట్ గా, అదిపెద్ద ఫ్లాప్ షో గా ముగిసిందని మాజీ ఉపసభాపతి, వైయ‌స్ఆర్‌సీపీ నేత కోన రఘుపతి విమర్శించారు. బాపట్లలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి అంశాన్ని రాజకీయంగా ప్రచారం చేసుకోవడం అలావాటైన చంద్రబాబు మరోసారి విద్యార్దుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన మెగా మీట్ ను కూడా దానికోసమే వినియోగించుకున్నారని మండిపడ్డారు. ఒక దిశానిర్ధేశం లేకుండా, ఏం ఆశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో, విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ఏ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని విమర్శించారు.  బాపట్ల లోని పార్టీ కార్యాలయంలో   వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి మీడియాతో మాట్లాడారు

విద్యారంగంపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బాపట్లకు వచ్చిన చంద్రబాబు ఈ ప్రాంతంలోని విద్యారంగ సమస్యలపై స్పందిస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం, తన పాలనలోని గొప్పతనాన్ని చాటుకోవడం కోసమే నిర్వహించినట్లు దీనిని చూసిన అందరికీ అర్థమయ్యింది. ఎన్నికలకు ముందు నీకు పదిహేనువేలు... నీకు పదిహేను వేలు... అంటూ ప్రతి చోటా నమ్మపలికి, ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన హామీలను ఎలా మరిచిపోయాడు? అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా తాను విద్యార్ధుల తల్లులకు ఇస్తానన్న పదిహేను వేల రూపాయల తల్లికి వందనంను ఎందుకు అమలు చేయడం లేదు? బాపట్లలో విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వస్తున్న సీఎం ఈ కార్యక్రమం సందర్భంగా తల్లికి వందనం కింద ఏ రోజున పదిహేను వేల రూపాయలు ఇస్తారో చెబుతారని, దీనిపై ప్రకటన చేస్తారని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. తీరా మొత్తం కార్యక్రమాన్ని తన భజనతో నిర్వహించుకుని, తల్లికి వందనంపై కనీసం మాటమాత్రం కూడా స్పందించకుండా చంద్రబాబు వెళ్ళిపోవడం దారుణం.

ఎంపిక చేసిన వారికే మెగా మీట్ లో పాల్గొనే అవకాశం

ఆరునెలల తన వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదనే లక్ష్యంతో బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా మీట్ లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న విద్యార్ధుల తల్లిదండ్రులను, వారికి వత్తాసు పలికే వారిని పూర్వ విద్యార్ధులు అనే ముసుగులో ఆహ్వానించారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను, ఈ స్కూల్ లో చదువుకున్న నాలాంటి వారిని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచారు. దాదాపు పదికోట్ల రూపాయలు ఖర్చు చేసి, పదిరోజుల పాటు మొత్తం అధికార యంత్రాంగం తాము చేయాల్సిన అన్ని పనులను మానుకుని, మెగా మీట్ కోసం ఫిల్టరింగ్ చేయడంలోనే మునిగిపోయింది. ఇంత చేసినా సీఎం చంద్రబాబు వచ్చారు... పోయారు... ప్రజలకు ఆయన పర్యటన వల్ల జరిగింది మాత్రం శూన్యం.

వైయస్ జగన్ అభివృద్ది చేసిన స్కూల్ లో చంద్రబాబు షో

సీఎంగా వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభివృధ్ధి చేసిన బాపట్ల స్కూల్ లో చంద్రబాబు మెగా మీట్ పేరుతో షో చేశారు. గత ప్రభుత్వం హయాంలో రూ.1.30 కోట్లతో ఆధునీకరించిన పాఠశాల తరగతి గదులు, కొత్త రీడింగ్ టేబుల్స్, లైట్లు, ఫ్యాన్లు వాటన్నింటినీ ఉపయోగించుకుంటూ చంద్రబాబు తన కార్యక్రమాన్ని నిర్వహించాడు. గత ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో విద్యకు ఒక్క బాపట్లలోనే 140 పాఠశాలలకు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టాం. ఇన్ని మంచి వసతులతో పాఠశాలలను అభివృద్ధి పరిచిన మనబడి నాడు-నేడు కార్యక్రమం పైనా, అందుకు కారణమైన వైయస్ జగన్ పైనా మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు కార్యక్రమంలో మేం పాల్గొంటే వీటిపై ప్రస్తావిస్తామనే భయంతోనే మమ్మల్ని దూరంగా ఉంచారు. 

విద్యా ప్రైవేటీకరణకే చంద్రబాబు మొగ్గు

చంద్రబాబు హయాంలో బాపట్ల హైస్కూల్ అభివృధ్ధి కోసం కొరకొరగా నిధులు కేటాయించి, అసంపూర్తిగా నిర్మాణ పనులు నిలిపివేస్తే, దాదాపు రూ.35 లక్షలు విడుదల చేసి అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేశాం. వైయస్ జగన్ హయాంలో ఇంగ్లీష్‌ మీడియం, సిబిఎస్ఇ విధానం, ట్యాబ్ లతో టెక్నాలజీని అందింపుచ్చుకోవడం, ఇంటరాక్టీవ్ ఫ్లాట్ ప్యానెల్స్, సకాలంలో యూనిఫారాలు, పుస్తకాల కిట్, గోరుముద్ద పేరుతో పౌష్టికాహారం ఇలా చెప్పుకుంటే మొత్తం విద్యారంగంలో ఇంత వరకు ఎవరూ చేయనన్ని సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలతో మార్పును తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రతిసారీ ప్రైవేటీకరణ, కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. 

బాపట్ల మెడికల్ కాలేజీ ప్రస్తావనే చేయలేదు

వైయస్ జగన్ బాపట్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడమే కాకుండా, మెడికల్ కాలేజీని కూడా బాపట్లకు మంజూరు చేశారు. బాపట్ల మెడికల్ కాలేజీకి కేటాయించిన 57 ఎకరాల్లో 54 ఎకరాల భూమికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మా ప్రాంతానికి మెడికల్ కాలేజీ రావాలని అందరూ ఎంతో ఉదారంగా సహకరించారు.అటువంటి దానిపైన కూడా కూటమి పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయడం దుర్మార్గం. తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు, ఖబడ్ధార్. సత్యదూరమైన ఆరోపణలు చేసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు సీఎం హోదాలో బాపట్లకు వచ్చారు. కనీసం బాపట్ల మెడికల్ కాలేజీ అభివృద్ది పైన ఎందుకు పెదవి విప్పలేదు. ఈ ప్రాంతం విద్యాపరంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదా? కనీసం స్థానికంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీనిపై చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళే సాహసం చేయలేదు. ఇదీ విద్యారంగంపై చంద్రబాబుకు ఉన్న చిన్నచూపు. అలాగే బాపట్లకు మంచినీటి చెరువు కోసం వంద ఎకరాలు కావాలని గతంలో సీఎం జగన్ గారిని అడిగితే వెంటనే మంజూరు చేశారు. ఎన్నికల సమయంలో ఈ ఫైలు నిలిచిపోయింది. కనీసం చంద్రబాబు పర్యటనలో దీనిపైన అయినా ప్రకటన చేస్తారని ఆశించారు. అది కూడా జరగలేదు. 

వైయస్ జగన్ పాలన కన్నా మెరుగ్గా చేస్తున్నాని చెప్పుకునే ధైర్యం ఉందా?

విద్యార్ధుల తల్లిదండ్రులతో మెగా మీట్ ఏర్పాటు చేసిన చంద్రబాబుకు తన ఆరునెలల పాలనలో విద్యాప్రమాణాలను గతంలో వైయ‌స్ జగన్ గారి హయాం కన్నా మెరుగ్గా చేశానని చెప్పుకునే ధైర్యం ఉందా?  వైయ‌స్‌ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన యూనిఫారాలతోనే విద్యార్ధులు చంద్రబాబు తో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు దిగిన హెలిప్యాడ్, అక్కడి నుంచి ప్రయాణించిన రహదారులు, ఆయన కూర్చున్న తరగతి గదులు ఇలా ప్రతి ఒక్కటీ వైయ‌స్ జగన్ గారి హయాంలో అభివృద్ధి చేసినవే. నిజంగా వైయ‌స్ జగన్ హయాంలో ఏ అభివృద్ధి జరిగి ఉండటకపోతే, ఎందుకు మెగామీట్ లో చంద్రబాబు దానిపై విద్యార్ధుల తల్లిదండ్రులను ప్రశ్నించలేదు? మీ హయాంలో చేసిన అభివృద్దిని గురించి చెప్పమని ఎందుకు తల్లిదండ్రులను అడగలేదు? 

అప్పులు...అబద్దాలతోనే చంద్రబాబు పాలన

టెక్నాలజీని నేనే కనిపెట్టాను... సెల్ ఫోన్ ను నేనే తీసుకువచ్చాను.. సత్యం నాదెండ్లకు నేనే స్ఫూర్తి అంటూ ప్రతిసారీ చంద్రబాబు నమ్మశక్యం కాని అంశాలతో ప్రజలన మభ్యపెడుతూ ఉంటారు. బెంగుళూరు, మహారాష్ట్రల్లో మనకన్నా ముందే ఐటి విప్లవం వచ్చింది. ఇన్ఫోసిస్ ద్వారా పదివేల ఉద్యోగాలను తీసుకువస్తున్నాను అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు, గత ప్రభుత్వం ఇన్ఫోసిస్ ను ఇక్కడ ఎలా ప్రోత్సహించిందో చెప్పే ధైర్యం ఉందా? ఇప్పటి వరకు అరవై కోట్లు అప్పులు తెచ్చారు. ఒక్క పెన్షన్లు, అరకొరగా ఉచిత సిలెండర్ల పంపిణీ తప్ప మీరు ఇచ్చిన హామీలను ఎక్కడైనా అమలు చేశారా? 

చంద్రబాబు వైఫల్యాల వల్లే జీఎస్టీ పడిపోయింది

జగన్ గారు పారదర్శకంగా, నిస్పక్షపాతంగా, రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హులకు డీబిటి ద్వారా డబ్బులు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. దానివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఆరునెలల చంద్రబాబు పాలనలో జీఎస్టీ పడిపోయిందని స్వయంగా ఆయనే చెప్పారు. ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవడం వల్లే ఇది జరిగింది. మీ విధానాల వల్ల ప్రజలు అందుకున్న ప్రయోజనాలు లేకపవడం వల్లే ఎక్కడ చూసినా నిరాశే కనిపిస్తోంది.

Back to Top