హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి

ప్రకాశం: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ హైకోర్టును ఆశ్రయించారు. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌పై ఆమంచి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరణం ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కృష్ణమోహన్‌ తెలిపారు. బలరామ్‌కు నలుగురు పిల్లలైతే ముగ్గురని అఫిడవిట్‌లో పేర్కొన్నారని వివరించారు. కరుణం బలరామ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమంచి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టే కోర్టులో పిటిషన్‌ వేశామని ఆయన తెలిపారు. 
 

Back to Top