చరిత్ర చెరిపేస్తే చెరగదు! 

రెండేళ్ల క్రితం ఇదే రోజు ఐదు మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభోత్స‌వం

మ‌హ‌త్త‌ర ఘ‌ట్టాన్ని గుర్తు చేస్తూ మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్ 

తాడేపల్లి: ‘చరిత్ర చెరిపేస్తే చెరగదు’ అంటూ రెండేళ్ల క్రితం నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా మెడికల్ కాలేజీల ప్రారంభోత్స‌వాల‌ను గుర్తు చేసుకుంటూ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్‌ చేశారు.

‘‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం (15 సెప్టెంబర్ 2023) వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విజయ నగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం. ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రక నిర్ణయం, వైయ‌స్ఆర్‌సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Back to Top