గుడివాడ : లోకేశ్ యువగళానికి పోటీగా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పంపుతాం. యువగళం సభ కంటే బైరెడ్డి సభకు 10 రెట్లు ఎక్కువగా జనం వస్తారని గుడివాడ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ మండలంలోని లింగవరంలోని వైయస్ఆర్ సీపీ జిల్లా యువజన విభాగం కమిటీ ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీకి పోటీగా ఎక్కడైనా, ఎప్పుడైనా లోకేశ్ యువగళం బహిరంగ సభను పెట్టే దమ్ముందా? దమ్ముంటే చంద్రబాబు, లోకేశ్... గుడివాడ, గన్నవరం నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. వైయస్ జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన లోకేశ్.. వైయస్ జగన్‌కే సవాల్ విసరడం హాస్యాస్పదమన్నారు. వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి మాట్లాడుతూ... విశాఖలో జరిగిన సమ్మిట్ విజయవంతం కాలేదనే దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉందా అని ప్రశ్నించారు.