అభ‌ద్ర‌తా భావంతో చంద్ర‌బాబు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

  ప్రకాశం జిల్లా: తెలుగుదేశం పార్టీపై నమ్మకం కోల్పోయి వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అన్న అభద్రతా భావంలో చంద్రబాబు ఉన్నాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎంతటికైనా దిగజారతాడని బాలినేని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సింగిల్‌గా ఎదుర్కోలేకే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

హోంమంత్రి వనితపై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను బాలినేని ఖండించారు. తన తోబుట్టువుతో సమానమైన హోంమంత్రి వనితను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. హోం మంత్రి మా ఆడపడుచు అనే ఉద్దేశ్యంతోనే ఓన్ చేసుకొని మాట్లాడాననీ దాన్ని వర్ల రామయ్య వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తన మీద ఏదో తీస్తున్నా.. తవ్వుతున్నా అన్న వర్ల  రామయ్యకు బాలినేని సవాల్ విసిరారు. దమ్ముంటే వర్ల రామయ్య తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఆయన అన్నారు.

తాజా వీడియోలు

Back to Top