ష‌ర్మిల‌మ్మా..ఇప్పటికైనా ఆ కబంధ హస్తాల నుంచి బయటకు రండి

వైయ‌స్ఆర్‌సీపీ ఇంటెలెక్టుల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు వై ఈశ్వర ప్రసాద్‌రెడ్డి 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కుమార్తెగా చెప్పుకుంటూ.. కోట్లాది అభిమానుల గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిన ఆ మహానుభావుని చావు కోరుకున్న దుర్మార్గుల చెంత చేరి, వారి చేతిలో కీలుబొమ్మ అయితే ఆ మహా నేత అభిమానులు ఎంతగా మానసిక క్షోభకు గురి అవుతారో ఒక్క గుర్తు చేసుకో తల్లి అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఇంటెలెక్టుల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు వై ఈశ్వర ప్రసాద్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  ఆ నాయకుడి కూతురిగా మీరు ఎలా భరించగలుగుతున్నారో గాని,  మాకు మాత్రం చాలా కష్టంగా వుంది. దయచేసి ఇప్పటికైనా ఆ కబంధ హస్తాల నుంచి బయటకు రండి’ అంటూ ఈశ్వర్‌ ప్రసాదరెడ్డి హితవు పలికారు.

మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌పై షర్మిల ఆరోపణల్లో ఏ మాత్రం లాజిక్‌ లేదంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఇంటెలెక్టుల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు వై ఈశ్వర ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.  ‘‘అటాచ్‌మెంట్‌లో ఉంది భూమి మాత్రమే, షేర్‌ కాదంటున్నారు. ఒక కంపెనీ లో మెజారిటీ షేర్లు ట్రాన్స్‌ఫర్‌ అయితే,   షేర్లతో పాటు భూమి కూడా కొన్న వారి స్వాధీనం అవుతుందనే చిన్న ప్రాథమిక సూత్రం విస్మరిస్తే ఎలా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
‘‘ఇలా భూమిని బదలాయింపు చేస్తే హైకోర్టు ఆజ్ఞలను అతిక్రమించినట్లు కాదా? దీని పర్యవసానం ఎలా వుంటుందన్నది మీకు తెలియదా?. మీ చర్యల వల్ల మీ మీద ప్రేమతో మీ సోదరుడు వైయ‌స్‌ జగన్‌ ఇవ్వాలనుకున్న ఆస్తులు మీకు వస్తాయో లేదో కానీ,  వైయ‌స్ఆర్  ద్వేషులు మాత్రం చాలా ఆనందంగా వున్నారు. బాగా చదువుకున్న దానివి. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా అమ్మా?’’  అని ఈశ్వర్‌ ప్రసాద్‌రెడ్డి అన్నారు.

Back to Top