వైయస్‌ జగన్‌తో ఇరిగెల సోదరుల భేటీ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఇరిగెల సోదరులు జననేతను కలిశారు. ఎన్నో ఏళ్ల పాటు టీడీపీకి సేవ చేసిన రాంపుల్లారెడ్డి సోదరులు ఆ పార్టీలో అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. భూమా కుటుంబంతో వీరు పోరాడుతున్నారు. పార్టీ మారిన భూమా కుటుంబం వీరిని వేధిస్తున్నా..చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇరిగెల సోదరులు టీడీపీని వీడారు. ఇటీవల వారు టీడీపీకి రాజీనామా చేశారు.  
 

Back to Top