ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

తాడేప‌ల్లి: ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. పీఆర్సీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆ కమిటీని అధికారిక కమిటీ కాదనడం సరైనది కాదన్నారు.జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో చర్చలకు ఆహ్వానం పంపాక అధికారికం కాకుండా ఎలా ఉంటుందని బొత్స ప్రశ్నించారు.  ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగమని తెలిపారు. 

Back to Top