సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన తూర్పు తీర రక్షక దళ కమాండర్

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని తూర్పు తీర రక్షక దళ కమాండర్,  అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివమణి పరమేష్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు శివ‌మ‌ణి ప‌ర‌మేష్ తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివ‌రించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో కోస్ట్‌గార్డ్‌ ఉన్నతాధికారులు డీఐజీ యోగేంధర్‌ ఢాకా, కమాండెంట్‌ కే.మురళి, డిప్యూటీ కమాండెంట్‌ ఏబి.రామమ్ ఉన్నారు.

Back to Top