టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

డిప్యూటీ సీఎం మంత్రి పుష్పశ్రీవాణి
 

అసెంబ్లీ: టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు బిల్లుపై  ఆమె మాట్లాడారు. ఎస్సీలకు ప్రత్యేక కమిషన్‌ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ నేతలు ఈ రకంగా రాద్దాంతం చేయడం విచారకరం. టీడీపీ ఎమ్మెల్యేలు దళితులంటే ఎంతవ్యతిరేకమే ఈ నినాదాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లు కలిసి ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు యావత్తు గిరిజనులు ధన్యవాదాలు తెలిపేందుకు ఈ రోజు చర్చ జరుగుతోంది. ఎస్సీలు, ఎస్టీలకు మేలు జరుగకూడదన్నదే వీరి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎస్సీలుగా ఎవరు పుట్టాలన్న పెద్ద మనిషి చంద్రబాబు. మంత్రివర్గం నుంచి ఎస్సీలను తొలగించిన ఘనత చంద్రబాబుది. ఈ రోజు వైయస్‌ జగన్‌ ఎస్సీలు, ఎస్టీలకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో చూస్తున్నాం. నామినేటేడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ రోజు చంద్రబాబు గిరిజనులకు నాలుగున్నరేళ్ల పాటు మంత్రి పదవి ఇవ్వకుండా ఆరు నెలల ముందు మంత్రిని చేసిన వ్యక్తి చంద్రబాబు. ఈ రోజు మంత్రి వర్గంలో ఐదుగురి ఎస్సీలకు మంత్రి పదవులు ఉన్నాయి. ఎస్టీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీలు, ఎస్టీల పట్ల వైయస్‌ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఇదీ. గిరిజనులకు ఎంతో మేలు చేసే విధంగా వైయస్‌ జగన్‌ తీసుకున్న ప్రతి నిర్ణయం హర్షించాలి. ప్రతిష్టాత్మకమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లుపై టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. 

Back to Top