మరిన్ని అటవీ ఫలాలకు మద్దతు ధర కల్పించేందుకు కృషి

డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి
 

 

అసెంబ్లీ: గిరిజానాభివృద్ధికి చెందిన భూములు ఆక్రమణకు గురికాలేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ఐదు అటవీ ఫలాలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించిందని, మరిన్ని అటవీ ఫలాలకు మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని కోరామని ఆమె చెప్పారు. 19–20 గాను టీఎస్‌పీ కింద నిర్మాణాల పనులకు, రూ.13.8 కోట్లతో 33 ఎల్‌పీజీ గ్యాస్‌ గోదాముల ఏర్పాటుకు ప్రతిపాదనల ఉన్నాయి. గౌరవ సభ్యులు చక్రపాణిరెడ్డి అటవీ శాఖ అధికారుల వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు అటవీ శాఖ అధికారులతో మీటింగ్‌ కూడా నిర్వహించాలని చెప్పారన్నారు. అదేవిధంగా సభ్యురాలు కళావతి చెప్పినట్లుగా గిరిజన భవనాలు మరమ్మతులకు గురయ్యాయని చెప్పారు.. ప్రతిపాదనలు తెప్పించుకొని సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. అదేవిధంగా సభ్యులు మహిధర్‌రెడ్డి యానదులు సమస్యలు పరిష్కరించాలని చెప్పారు.. ఆ ప్రశ్న నోట్‌ చేసుకున్నాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సభ్యులు బ్రహ్మనాయుడు బొల్లాపల్లి మండలంలో ఆశ్రమ పాఠశాల నిర్మాణం గురించి చెప్పారు.. వాటిని పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వివరించారు.

Back to Top