మద్య నిషేధానికి బాబు వ్యతిరేకమా..? అనుకూలమా..?

డిప్యూటీ సీఎం నారాయణస్వామి
 

అమరావతి: మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. మద్యపాన నిషేధంపై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మద్యపాన నిషేధానికి చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాలన్నారు. బాబు పాలనలో గ్రామానికి పది బెల్టుషాపులు ఉండేవని, మద్యాన్ని ఏరులై పారించి పేద, మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేశాడన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు నెలల్లోనే బెల్టుషాపులన్నింటినీ నిర్మూలించారన్నారు. మద్యం షాపులను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందని, గతంలో ఉన్నవాటికంటే 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించామన్నారు. మద్యం ధరలు పెంచి పేదవాడికి మద్యం దూరం చేస్తున్నామని వివరించారు.

Read Also: తప్పుచేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు

Back to Top