తప్పుచేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు

భూకుంభకోణంలో ప్రధానపాత్రదారులు పెద్దబాబు, చిన్నబాబు

సీఎం వైయస్‌ జగన్‌ నియమించిన సిట్‌తో బాధితులకు న్యాయం

లోకేష్‌కు మాట్లాడడం రాదు కానీ, మూటలు సర్దడం వచ్చు

విశాఖలో టీడీపీ కార్యాలయం కూడా అక్రమ కట్టడమే..

విశాఖ భూకుంభకోణంపై విచారణ చేయాలని గంటా లేఖ రాశారు

దోపిడీపై విచారణ జరిపించడం తప్పా..

బాధితులంతా సిట్‌ ముందుకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వండి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: భారతదేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం విశాఖలో చంద్రబాబు హయాంలో జరిగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. భూ కుంభకోణంలో ప్రధాన పాత్రదారులు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ అని అన్నారు. నారా లోకేష్‌కు మాట్లాడడం రాదు కానీ.. మూటలు సర్దడం మాత్రం బాగా నేర్చుకున్నాడన్నారు. విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా అక్రమ కట్టడమేనన్నారు. విశాఖ భూములను రక్షించి బాధితులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిట్‌ వేశారన్నారు. ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, ఒక రిటైర్డ్‌ జడ్జితో త్రిమెన్‌ కమిటీ సిట్‌ను నియమించారన్నారు. గత ప్రభుత్వ కుంభకోణాలన్నీ వెలికితీస్తామని, తప్పు చేసిన వారు ఎవరైనా విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు.

విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అండదండలతోనే గతంలోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు భూకుంభకోణాలకు పాల్పడ్డారని, దానికి సంబంధించి అనేక రుజువులు, నివేదికలు, కంప్లయింట్స్‌ ఇచ్చామన్నారు. సీబీఐకి కూడా కంప్లయింట్‌ ఇచ్చామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఏరకంగా ఉపయోగపడకపోయినా.. విలువైన భూములను ఏరకంగా దోచుకుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. దీనికి ల్యాండ్‌ పూలింగ్, ఎక్విజేషన్, ఏపీఐసీ అని రకరకాల పేర్లు పెట్టారన్నారు.

భూముల రిజిస్ట్రేషన్‌ పత్రాలను కూడా తారుమారు చేశారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఇంట్లో పత్రాలు ఒకరి పేరు మీద ఉంటే.. ఆన్‌లైన్‌లో మరొకరి పేరుమీద నమోదు చేయించారన్నారు. గతంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కొన్ని వేల ఎకరాలు దోచుకున్నారన్నారు. మాజీ సైనికులకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్నారని, ఆధారాలన్నీ ప్రజల ముందు పెట్టామన్నారు. వైయస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా విశాఖకు వచ్చి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే ధర్నా కార్యక్రమం చేస్తే స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను నియమించారని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అధికారులతో వేసిన సిట్‌ను కూడా వ్యతిరేకించామన్నారు. భూ కుంభకోణంపై 3300 ఫిర్యాదులు వస్తే.. ఏ దానికైనా పరిష్కారం చూపించారా.. అని చంద్రబాబును ప్రశ్నించారు. సిట్‌ రిపోర్టు బహిర్గతం చేయకుండా.. కేబినెట్‌ సమావేశంలో సిట్‌ నివేదికను ఆమోదించి స్వీట్లు పంచుకున్నారని గుర్తుచేశారు.

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం విశాఖపట్నంలోని భూకుంభకోణంపై సిట్‌ను నియమించారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ చెప్పారు. గతంలో సిట్‌ రిపోర్టు ఉంది కదా.. ఇప్పుడు వేసి ఏం సాధిస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారని, గతంలో కేబినెట్‌ సమావేశంలో ఆమోదించామని చెప్పిన సిట్‌ నివేదికను బహిర్గతం చేయకుండా చంద్రబాబు ఆమోదించాడని ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాసిన సీఎంకు లేఖరాశారని చెప్పారు. మాజీ మంత్రి గంటా కూడా దర్యాప్తు చేయాలని లేఖ రాశారన్నారు. ఆ రిపోర్టును బయటపెట్టి పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వేసిన సిట్‌తో బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. భూకుంభకోణంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని గతంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఇప్పుడు ధైర్యంగా వచ్చి కంప్లయింట్‌ ఇవ్వాలని కోరారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట రూ.600 నుంచి రూ.700 కోట్ల విలువైన భూములను సొంతం చేసుకున్నారని, దోపిడీపై విచారణ జరిపించడం తప్పా అని ప్రశ్నించారు. ప్రజలు సిట్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలకృష్ణ చిన్న అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్‌ బ్యాంకు సొమ్ము ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

Read Also:  ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

 

తాజా వీడియోలు

Back to Top