కాకినాడలో 34 వేల మందికి ఇళ్ల స్థలాలు

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
 

కాకినాడ: కాకినాడ నియోజకవర్గంలో జులై 8న వైయస్‌ఆర్‌ జయంతి రోజు 34 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం వైయస జగన్‌ చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ఆటంకాలు సృష్టించాలని చూస్తే లబ్దిదారులతో  కలిసి నిరాహార దీక్షకు దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో  టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారని ద్వారంపూడి దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడం టీడీపీ ఇష్టం ఉండదని ఆయన మండిపడ్డారు. 

త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కొండబాబు భూ కబ్జాలు, అక్రమాలు సాక్షాధారాలతో సహ బయటపెడతానని తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాల కబ్జా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారిని కూడా సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు. జగన్నాధపురంలో క్రైస్తవుల శ్మశానవాటికకు ఇచ్చిన 5 ఎకరాల భూమిపై కూడా కొండబాబు కోర్టుకు వెళ్లిఅడ్డుకుంటున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. 

Back to Top