పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే ల‌క్ష్యం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహణ

 అమలాపురం:  పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే రాజకీయ సవాళ్లకు సమర్థంగా సిద్ధమవడమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించామని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని వాసర్ల గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ హాజరై జిల్లా పార్టీ నాయకులకు సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా రాజానగరం నియోజకవర్గంలో కమిటీల నియామకాలకు సంబంధించి చేపడుతున్న ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు. పార్టీ నిర్మాణం వ్యవస్థబద్ధంగా, పారదర్శకంగా జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబి, ఎమ్మెల్సీలు బొమ్మి ఇశ్రాయేల్, కుడిపూడి సూర్యనారాయణ రావు, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ పాల్గొన్నారు. అలాగే అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్, పి. గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, రాష్ట్ర కార్యదర్శులు, CEC, SEC సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top