ఫ్లైఓవర్‌ నిర్మాణం పేరుతో దర్గాను తొలగించవద్దు.. 

జిల్లా కలెక్టర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత షేక్‌ నూరి ఫాతిమా వినతి

గుంటూరు: మంగళగిరిలో సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ హజరత్‌ సయ్యద్‌ మాలిక్‌ హుస్సేన్‌ ఔలియా దర్గాను ప్రతిపాదిత ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం తొలగించే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా కలెక్టర్‌ను కలిసి దర్గా ప్రాధాన్యతను వివరించి, దాని తొలగింపు ప్రయత్నాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పురాతన దర్గాను పరిరక్షిస్తూ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆఫీజ్‌ ఖాన్‌, రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ఖాదర్‌ బాషా, గుంటూరు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సైదా ఖాన్‌తో పాటు గుంటూరు, మంగళగిరి నియోజకవర్గాలకు చెందిన మైనారిటీ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top