క‌బ‌డ్డీ క్రీడాకారుల‌కు టీ ష‌ర్ట్స్ పంపిణీ

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర‌స్థాయి క‌బ‌డ్డీ పోటీల‌కు ఎంపికైన క్రీడాకారుల‌కు టీ ష‌ర్ట్స్ పంపిణీ చేశారు. సోమ‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లా పరిషత్ చైర్మ‌న్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం కప్ పోటీల్లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన నెల్లిమర్ల నియోజకవర్గం కబడ్డీ జట్టు క్రీడాకారులకు జిల్లా పరిషత్ చైర్మ‌న్‌ మద్ది శ్రీనివాసరావు (చిన్న శ్రీను),జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కౌశిక్ ఈశ్వర్, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం పరిశీలికలు కెవి సూర్యనారాయణ రాజు (పులి రాజు)  చేతుల మీదుగా టీ ష‌ర్ట్స్ పంపిణీ చేశారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాల‌ని వారు ఆకాంక్షించారు.

Back to Top