తాడేపల్లి: కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేశారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అండగా ఉంటారని జిల్లా నాయకులు భరోసా కల్పించారు. శనివారం ఆయా జిల్లా కేంద్రాల్లోని డిజిటల్ బుక్ యాప్(YSRCP Digital Book)ను లాంచ్ చేశారు. ‘అనంత’లో డిజిటల్ బుక్ ఆవిష్కరణ అనంతపురంలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘డిజిటల్ బుక్’ ను పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలకు అండగా నిలవడానికే ‘డిజిటల్ బుక్’ ఓపెన్ చేశామన్న అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 28వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో, 29వ తేదీన మండల స్థాయిలో ‘డిజిటల్ బుక్’ ఆవిష్కరణ ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట: అనంత ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో చంద్రబాబు కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతోంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్‌సీపీ హయాంలో పనిచేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. చివరకు పోలీసుల తీరుపై మండిపడుతూ అక్రమ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా జరగలేదు. కేవలం ఏపీలో మాత్రమే జరిగింది. ఎప్పటికప్పుడు కోర్టులు అక్షింతలు వేస్తున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. సిగ్గులేని ఈ ప్రభుత్వం అలాగే వెళ్తోంది. వైయస్ఆర్‌సీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ అధికారంలోకి వచ్చేది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అది మూడు నెలలైనా.. మూడేళ్ల తర్వాత అయినా వచ్చేది వైయస్ఆర్‌సీపీనే. ఈ రోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్‌లో చర్యలు ఖాయం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటలు విని ముందుకెళ్తే భవిష్యత్‌లో ఎక్కడ ఉన్నా చట్టం ముందు నిలబెడతాం. ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్ బుక్’లో నమోదు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే అందరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో బాధితులు ఎవరైనా సరే ‘‘డీబీ.డబ్ల్యూఈవైయస్‌ఆర్‌సీపీ.కామ్’’ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చు. అదే విధంగా 040–49171718 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయచ్చు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. కర్నూలు జిల్లా.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. అన్యాయానికి గురువుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కోసం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఎస్వీ మోహన్ రెడ్డి, మేయర్ బి.వై.రామయ్య, రాష్ట్ర మహిళ జోనల్ ప్రెసిడెంట్ విజయమనోహరి, కర్నూల్ నగర అధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్ ఆవిష్కరించారు. డిజిటల్ బుక్ శ్రీరామ రక్షణ : ఎస్వీ మోహన్‌రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్షణ కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంచ్ చేసిన డిజిటల్ బుక్ ఓ శ్రీరామ రక్షణగా పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ, పోలీసులు వేధింపులతో ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నాం. కార్యకర్తల రక్షణ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. కార్యకర్తలను అనవసరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తుల పేర్లు పోలీసుల పేర్లు నమోదు చేస్తాం. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాడిన అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష్య సాధింపులో భాగంగా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకోచ్చారు. తాము కార్యకర్తలతో కోసం డిజిటల్ బుక్ ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నాం, ఎవరైన కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసిన వ్యక్తులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సప్తసముద్రాలు దాటి వెళ్ళిన వారిని తిరిగి తీసుకొచ్చి చట్టం ప్రకారం న్యాయపోరాటం చేస్తాం. ఈ డిజిటల్ బుక్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉపయోగించుకోవాలి, కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను టార్గట్ చేసుకోని వేధింపులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు హైకోర్టులో కూడా పోలీసులకు మొట్టికాయాలు వేసినా వీరికి బుద్ది రాలేదు ... ప్రకాశం జిల్లా.. పార్టీ అధ్యక్షుడు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికి లాంచ్ చేసిన డిజిటల్ బుక్ ను ఇవాళ ఒంగోల్‌లోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మనంద రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరి రవి బాబు, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కసుకుర్తి ఆదెన్న, వై.వెంకటేశ్వర రావు, నగర అధ్యక్షులు కటారి శంకర్ , జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, దాసరి కరుణాకర్, రొండా అంజిరెడ్డి, తాత నర్సింహగౌడ్ దేవరపల్లి అంజిరెడ్డి, పాలడుగు రాజీవ్,దేవా,వేముల శ్రీకాంత్, పులుసు సురేష్, పిగిలి శ్రీనివాసులు,సురేందర్ రెడ్డి, కూనం గౌతమ్, పెట్లూరి ప్రసాద్, పనిదెపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా.. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ రెడ్డి ,రాష్ట్ర, జిల్లా కమిటీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. డిజిటల్ బుక్ ఏంటో చూపిస్తాం: దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైయస్ జగన్ ఈ నెల 24 వ తేదీన డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారని తెలిపారు. ఇన్నాళ్లూ రెడ్ బుక్ పేరుతో.. మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి డిజిటల్ బుక్ ఎంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. రెడ్ బుక్ లాగా చిల్లర గా మేము వ్యవహరించమని స్పష్టం చేశారు. నాయకులతో పాటు కొంత మంది అధికారులు కూడా వైయస్ఆర్‌సీపీ నాయకులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ బుక్ లో పేరు రాకుండా చూసుకోండి.. లేక పోతే మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వాటికి ప్రతి చర్య తప్పదని దేవినేని అవినాష్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా.. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్లను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా వెబ్‌సైట్‌లో మీ సమస్యలు నమోదు చేయవచ్చు అని తెలిపారు. IVRS విధానం ద్వారా 040 - 49171718 నెంబర్ కు ఫోన్ చేసి కూడా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చు అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..` ఈ డిజిటల్ బుక్ ప్రతి వైయస్ఆర్‌సీపీ కుటుంబ సభ్యులకు శ్రీరామరక్షగా పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వంలో అన్యాయాన్ని గురైన ప్రతి వైయస్ఆర్‌సీపీ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఓట్లు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య,వ్యవసాయ రంగాలు పూర్తిగా బ్రష్టు పట్టించారు . పేదవాడికి మెడికల్ విద్య అందని ద్రాక్షగా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజులు నిధులు విడుదల చేయక సామాన్య మధ్యతరగతి విద్యార్థులు తల్లడిల్లి పోతున్నారు. నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. ఆడ నిధి అంటూ మహిళలకు వెన్నుపోటు పొడిచారు. ఈ భారత దేశ చరిత్రలో ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు , రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షుడు దుంపల రామారావు (లక్ష్మణ రావు), వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర వెలమ సామాజిక వర్గం అధ్యక్షుడు అంబటి శ్రీను, రాష్ట్ర కళింగ వైశ్య సామాజిక వర్గ అధ్యక్షుడు అందవరపు సూరిబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు , జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, కార్యదర్శులు సనపల నారాయణరావు, మార్పు పృథ్వి ,సాధు వైకుంఠరావు , రౌతు శంకర రావు, నైరా కృష్ణ,తoగుడు నాగేశ్వరరావు తదితర వైసిపి నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా.. ఏలూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, అన్యాయానికి గురైన ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తకు అండగా నిలిచేందుకు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ " డిజిటల్ బుక్"ను రూపొందించారని, ఈ డిజిటల్ బుక్ రెండు విధాలుగా పనిచేస్తుందని, ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్ digitalbook.weysrcp.com లో ఫోటోలు, ఆధారాలు కూడా అప్లోడ్ చేయవచ్చని, రెండవదిగా ఐ.వి.ఆర్.ఎస్ నెంబర్ 040-49171718 ద్వారా కూడా కార్యకర్తలు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ , చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయ రాజు, రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా.. బాపట్ల జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్, పోస్టర్ ఆవిష్కరించారు. డిజిటల్ బుక్ ఉద్దేశం, ఫిర్యాదు చేసే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన, అధికారి పార్టీ నాయకులు ప్రజలను ఇబ్బంది పెట్టినా క్యూఆర్ కోడ్ లో స్కాన్ చేసి మీ సమస్యను ఫిర్యాదు చేయవచ్చు. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని వైయస్ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. డోన్‌లో.. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ లాంచే చేశారు. కార్యక్రమంలో డోన్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాదులు నాగభూషణం రెడ్డి, విశ్వనాథ రెడ్డి, నంద్యాల జిల్లా వాలంటరీ విభాగ అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్, డోన్ మండల అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశేలా రాజేష్, వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు, మాజీ పట్టణ అధ్యక్షుడు హరి, డోన్ పట్టణ యూత్ లీడర్ చలం వంశీ, మండల యూత్ లీడర్ బుగ్గన జయచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా.. విశాఖపట్నం మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఆదేశాలు మేరకు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త దేవాన్ష్ రెడ్డి , ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైయస్ఆర్ కడప జిల్లా.. కడపనగరంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ డిజిటల్ బుక్ పోస్టర్ విడుదల చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధ , మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష, కడప పార్లమెంట్ పరిశీలకుడు అజయ్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు సురేష్ బాబు, కడప మేయర్ ముంతాజ్ బేగం కార్యక్రమంలో పాల్గొని డిజిటల్ బుక్ గురించి కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం లో ఇబ్బంది పడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చని నాయకులు వివరించారు. అన్నమయ్య జిల్లా.. రాయచోటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి. అమరనాధ్ రెడ్డి, రాయచోటి మాజీ శాసన సభ్యుడు గడికోట.శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డి పల్లి మాజీ శాసన సభ్యులు రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎవరైతే కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు, దాడులు చేసి ఇబ్బంది పెడుతున్నారో వారందరిని కూడా ఇందులో చేర్చి న్యాయబద్దంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ బుక్ ను కార్యకర్తల కోసం, అధికార పార్టీ దౌర్జన్యానికి బలైన ప్రజల కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంచ్ చేశారని చెప్పారు. పల్నాడు జిల్లా.. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీ నేతలు డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజినీ, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు , సత్తెనపల్లి ఇన్‌చార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, నియోజకవర్గ పరిశీలికులు పడాల శివారెడ్డి, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.