రామ‌శేషు మ‌ర‌ణం బాధాక‌రం

 రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం:   వైయ‌స్ఆర్‌సీపీ నేత‌,  వైస్ ఎంపీపీ రామశేషు మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం అని  మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. రామ‌శేషు స్వ‌గృహంలోనిర్వ‌హించిన సంతాప స‌భ‌లో దివంగ‌త నేతకు పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంపీపీ  రఘురాం ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాను. శ్రీకూర్మం లో ఏ కార్యక్రమం జరిగినా రామశేషు ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగేది. ఈరోజు ఆయన సంతాప సభ నిర్వహించడం బాధాకరం. వివాదాలు లేకుండా ఉండాలి అని, ఎప్పుడు కోరుకుంటాను, నా నియోజకవర్గ లో జరిగినందుకు అవమానంగా భావించాను. చంపడంతో సమస్యలు పరిష్కారం కావు. ఆ హత్య చేసిన వ్యక్తి కుటుంబం, హ‌త్య‌ను ప్రోత్స‌హించిన వ్య‌క్తుల స‌మూహం సమాజం నుంచి వెలివేత‌కు గురి అవుతారు. 
ఇటువంటి హ‌త్యోదంతాలు ప్ర‌జా స్వామ్య దేశాన సంబంధిత వ్య‌వస్థ‌ల మ‌నుగ‌డ‌కు శ్రేయోదాయ‌కం కాదు. రామ శేషు మరణం మాకు తీరని లోటు. పది మందికి పనికి వచ్చే వ్యక్తులు అరుదు.అందులో రామశేషు ఒక్కరు, సమాజంలో అశాంతి నెల‌కొల్పితే హంత‌కుల‌కు ఏం వస్తుంది ? గ్రామం అభివృద్ధి కోసం ఆలోచన చేసి, అవసరం అయితే సొంత డ‌బ్బులు సైతం ఖర్చు చేసేందుకు వెనుకంజ వేయ‌ని వ్య‌క్తి రామ‌శేషు. ఈ బాధ‌క‌ర స‌మయాన ఆ కుటుంబానికి సీఎం జగన్ అండగా ఉంటానని తెలిపారు. రామశేషు తన నా నిర్ణయానికి ఏరోజు ఎదురు చెప్పింది లేదు. గురువు చెప్పారు.. నేను చేయాలి అనే ఆలోచన తో ముందుకు వెళ్ళేవారు. రామశేషు పేరున ప్రభుత్వ కార్యక్రమం ఒకటి చేస్తాము. ఆయన పేరు మీద ఇక్కడ భవనం లేదా ఇంకా వేరే విధంగా ఆయ‌న పేరు చిరస్థాయిగా నిలిచి ఉండే కార్యక్రమం ఒక‌టి సీఎం వైయ‌స్ జగన్ తో మాట్లాడి చేయ‌నున్నాం. అదేవిధంగా శ్రీ‌కాకుళం నియోజకవర్గ పర్యటనకు సీఎం వైయ‌స్ జగన్ వచ్చినప్పుడు రామ శేషు కుటుంబాన్ని కలుస్తారు. రామ‌శేషు హ‌త్య‌ను ఖండిస్తూ.. మండ‌ల ప‌రిష‌త్ స‌ర్వ స‌భ్య స‌మావేశాన బల పరిచిన తీర్మానాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందివ్వాలని మండల నాయకులను కోరుతున్నాను..అని మంత్రి ధ‌ర్మాన త‌న సంతాప సందేశం ముగించారు.

కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎంపిపి గోండు రఘురాం, సర్పంచ్ గోరు అనిత, ముంజేటి కృష్ణ, చిట్టి జనార్ధనరావు, చల్లా రవికుమార్, గోండు కృష్ణ మూర్తి, ముకళ్ల తాత బాబు, కొనర్క్ శ్రీనివాసరావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, పీస శ్రీ హరి, గోపి, మధు రెడ్డి, అప్పుల నాయుడు, ఎచ్చెర్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top