సీఎం వైయ‌స్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తే సహించేదిలేదు

వైయ‌స్ఆర్‌సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌

 విజయవాడ: సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను విమర్శిస్తే సహించేదిలేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్ హెచ్చ‌రించారు. టీడీపీ అధినేత చంద్రబాబును.. సొంత పార్టీ నేతలే తిడతార‌న్నారు. విజయవాడలో టీడీపీ భూ స్థాపితం అయిపోయిందని ఎద్దేవా చేశారు. 

దేవినేని అవినాష్‌ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశం ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. చంద్రబాబు టీడీపీ నేతల్ని పిలిపించి సమావేశం పెట్టమన్నాడు. కొడాలి నాని, వంశీ ,అవినాష్‌ల మీద శపథాలు చేయండి.. తొడలు కొట్టండి అని చెప్పాడు. అలా చేసిన టీడీపీ నేతల చీకటి బ్రతుకులు నాకు తెలుసు. ఇప్పుడు తొడలు కొట్టిన వారే.. ఉదయం చంద్రబాబును పొగుడుతారు.. మళ్లీ వారే రాత్రి అయితే వెదవ అని తిడతారు. 

వైయ‌స్ఆర్‌సీపీ నేతల కన్నా.. టీడీపీ నాయకులే చంద్రబాబును ఎక్కువగా తిడతారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచింది కాబట్టే.. ఏమీ చేయలేక కవ్వింపు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కాల్‌మనీ సెక్స​్‌ రాకెట్‌లో పాత్రధారులు. టీడీపీ విజయవాడలో ఎప్పుడో భూ స్థాపితం అయిపోయింది. దేవినేని ఉమకు మైలవరంలోనే గతిలేదు. ఇంకా జిల్లాలో టీడీపీనేం గెలిపిస్తాడు?. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top