తిరుపతి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతి నగరంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో `చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ`..బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు పాలనతో ప్రజల్లో ఇప్పటికే విసుగు మొదలైంది. మంచం మీద పడుకున్న ముసలమ్మ నొక్కిద్ది బటన్ విశేషమా అన్నారు... ఇప్పుడు ఆ బటన్ నొక్కలేక పోతున్నారు. సంపద సృష్టించి పేదవాడికి పంచుతా అన్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తా అన్నారు.. మర్చిపోయారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామన్నారు దానిని పీ4కు మార్చేశామంటున్నారు. నిరుద్యోగ భృతి అడిగితే స్కిల్ డెవలప్‌మెంట్‌లో కలిపేశాం అంటున్నారు. లోకేష్ గాని చంద్రబాబు గానీ పీఫోర్లో ఎంత ఇచ్చారు తమ నియోజకవర్గాల్లో. వారి సొంత డబ్బు ఒక్క రూపాయిఅయినా ఇచ్చారా..?, ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామాలాడుతున్నారు. సంవత్సర కాలంలో 1 లక్ష76 వేల కోట్లు అప్పు చేశారు. ఈవీఎంల తో మోసం చేసి గెలిచారు. వైయస్ జగన్ అబద్ధాలు చెప్పి మోసం చేయలేదు కూటమినేతల్లా వెన్నుపోట్లు పొడవ లేదు. పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఓట్లు వేసిన వారికే కాదు వేయనివారికి సైతం మేలు చేయామని మా నాయకుడు వైయస్ జగన్ చెప్పారు. వైయస్ఆర్ సీపీకి వారికి పథకాలు ఇవ్వద్దు అని అంటున్నారు చంద్రబాబు.. ఆయన బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నారా...?, కూటమి నేతలు ఎన్నికల ముందు.. అనేక వాగ్దానాలు చేశారు.. ఎన్ని నెరవేర్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేశారు’ అని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్ర రెడ్డి, కార్పొరేటర్లు కోటేశ్వరమ్మ, బోకం అనిల్, అనీష్ రాయల్, నాయకులు పెంచలయ్య, తలరి రాజేంద్ర, నాగిరెడ్డి, సప్తగిరి రాజా, బొగ్గుల వెంకటేష్, పడమటి కుమార్, జయచంద్ర రెడ్డి, అరుణ్ కుమార్, లవ్లీ వెంకటేశ్వర్లు, వాసు యాదవ్, వెంకటేశ్వరావు రాయల్, అరుణ్ యాదవ్, బృంగి నవీన్, రెడ్డప్ప, స్వరూప్, కోటి, కుప్పయ్య, యోగాంజనేయ రెడ్డి, దుర్గ, వంశి, ముస్టాఫ్త్, ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.