9న వైయ‌స్ జ‌గ‌న్ బంగారుపాళ్యెం ప‌ర్యాట‌న ఖాయం

మాజీ సీఎం పర్యటన ఖరారు కావడంతో కూటమి ప్రభుత్వంలో గుబులు  

హెలిప్యాడ్ ఏర్పాట్ల‌ను పరిశీలించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ముఖ్య నేత‌లు

తిరుప‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 9న, బంగారుపాళ్యెం ప‌ర్య‌ట‌న ఖాయ‌మైంద‌ని చిత్తూరు ఉమ్మ‌డి జిల్లాల అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. మామిడి రైతులకు అండగా జగనన్న చేపట్టే కార్యక్రమ నిర్వహణ స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్ల‌ను పార్టీ ముఖ్య నేత‌లు విజయానంద‌రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, సునీల్, ల‌లిత కుమారి త‌దిత‌రుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా భూమ‌న మాట్లాడుతూ..`ఈనెల 9 న బంగారుపాల్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులు ను వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి క‌లువ‌నున్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో కూటమి ప్రభుత్వంలో గుబులు మొదలైంది. కిలో మామిడి ధర 8 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నా ఆచరణలో అమలు కావడం లేదు. రైతుల్ని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లకుండా నియంత్రించే కుట్రలు చేస్తున్నారు. మామిడి రైతులు నెలరోజులుగా పట్టించుకోకుండా నిరక్ష్యంగా వదిలేసింది.  సొంత జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు చొరవ చూపలేదు. మామిడి పంటను తక్కు ధర కే కిలో 3 రూపాయలకే అమ్ముకోవాల్సిన దుస్థితి. కూటమి ప్రభుత్వం పాలనలో రైతులకు తీరని అన్యాయం చేస్తోంది` అని మండిప‌డ్డారు.

Back to Top