సంక్షేమ పాలనలోనే నిజమైన సేవ

డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాషా

వైయ‌స్ఆర్ జిల్లా: ప్రజలకు సంక్షేమ పాలన అందించడం ఒక్క వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష అన్నారు. కడప నగరంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా క్రిస్టియన్ మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేసిన పార్టీ వైయ‌స్ఆర్ సీపీ అని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జననేత వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని వివరించారు. ముఖ్యంగా ప్రతి పాస్టర్‌కు గౌరవ వేతనం రూపంలో నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవనోపాధికి భరోసా కల్పించారని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో కూడా  వైయ‌స్ఆర్ సీపీ మాత్రమే మైనార్టీల సంక్షేమాన్ని హృదయపూర్వకంగా తీసుకుంటుందని, భవిష్యత్తులోనూ అదే దిశగా ముందుకు సాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు పాస్టర్ ష‌డ్ర‌క్‌, నగర క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు విజయ్ కిషోర్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి పాస్టర్ జాన్, మాజీ కోఆప్షన్ సభ్యులు మరియలు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top