అందుకే మద్యం ధరలు పెంచాం

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి

సచివాలయం: దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్య నిషేధం చర్యల్లో భాగంగానే ధరలు పెంచామని వివరించారు. సచివాలయంలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మద్యపాన నిషేధానికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వివరించారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని, ఎన్టీఆర్‌ తెచ్చిన మద్యపాన నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచాడని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని, మద్యం మహమ్మారి వలన ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఈ పరిస్థితి మారాలని సీఎం వైయస్‌ జగన్‌ మద్యపాన నిషేధాన్ని తీసుకువచ్చారన్నారు. 20 శాతం మద్యం దుకాణాలు, 43 వేల బెల్టుషాపులను తొలగించామన్నారు. టీడీపీ నేతలు నాటు సారా, నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారని, చంద్రబాబు మనుషులే బార్లలో అక్రమ మద్యం వ్యాపారం చేశారన్నారు. వందల కోట్ల మద్యం ముడుపులు తీసుకున్నది చంద్రబాబే అని మంత్రి నారాయణ స్వామి అన్నారు.  

Back to Top