పదవి కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడు

ప్రభుత్వంపై బురదజల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది

డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్ర‌హం

చిత్తూరు: పదవి కోసం చంద్రబాబు ఎంత నీచస్థాయికైనా దిగజారుతాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. గంగాధర నెల్లూరులో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదజల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అబద్ధాల్లో పుట్టి, పెరిగిన చంద్రబాబుకు అధికార దాహం విపరీతంగా పెరిగిపోయిందని, పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడన్నారు. రామరాజ్యంలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో అదే మాదిరిగా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పేదల కుటుంబాల్లో నెలకొన్న చీకట్లను తొలగించి.. వెలుగులు నింపుతున్నారన్నారు. 
 

Back to Top