టీడీపీకి ఓట్లు రావనే ఎస్‌ఈసీ చెలరేగుతోంది

నిమ్మగడ్డను అడ్డంపెట్టుకొని బాబు డ్రామాలు

డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజం

తిరుపతి: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డను అడ్డంపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. నిమ్మగడ్డ తీరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. టీడీపీకి ఓట్లు రావనే ఎస్‌ఈసీ చెలరేగుతున్నాడని మండిడపడ్డారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో అనైకతి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ప్రజలంతా ఉన్నారన్నారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించి.. గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top