ఆదినారాయణరెడ్డిని తరిమికొట్టాలి

డిప్యూటీ సీఎం నారాయణస్వామి
 

 వైయ‌స్ఆర్ జిల్లా: బీజేపీకి దళితులు ఓటు వేసే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పోరుమామిళ్లలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఆదినారాయణరెడ్డిని బద్వేల్‌ ప్రజలు తరిమికొట్టాలన్నారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మోసం చేసి మంత్రి పదవి కోసం ద్రోహం చేసి వెళ్లారంటూ దుయ్యబట్టారు.  
దళితులకు నాగరికత లేదని మాట్లాడిన నీకు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో వైఎస్‌ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించిందని.. బద్వేల్‌ ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని’’ నారాయణస్వామి అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top