భూముల రీసర్వేతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం

పాదయాత్రలో విన్న ప్రతీ సమస్యకు పరిష్కారం చూపుతున్న సీఎం

సీఎం పుట్టినరోజున వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ ప్రారంభించడం సంతోషం

రైతుల‌పై పైసా భారం ప‌డ‌కుండా రీస‌ర్వే 

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజున ‘వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా భూముల సమగ్ర రీసర్వే పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందని, పాదయాత్రలో ఎక్కువగా వచ్చిన భూ తగాదాల వినతుల పరిష్కారానికి ‘వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ పథకం ప్రారంభించారన్నారు. ఈ పథకం రూపకల్పనకు పాదయాత్రలోనే బీజం పడిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సమగ్ర భూ రీసర్వే పథకం ప్రారంభించిన అనంతరం ఎస్‌జీఎస్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే.. ‘మాటిస్తే మడమ తిప్పని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వారసుడు వైయస్‌ జగన్‌.. తండ్రిలాగే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు 90 శాతానికిపైగా ఏడాదిన్నర పాలనలోనే అమలు చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ పుట్టిన రోజున భూముల రీసర్వే లాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పథకం ఇది. 

వందేళ్లుగా ఉన్న సరిహద్దు వివాదాలను చెరిపేసేందుకు భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు తీసుకువచ్చాం. ‘వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ పథకం ద్వారా జరుపుకుంటున్నాం. ప్రభుత్వ రంగ సంస్థ సర్వే ఆఫ్‌ ఇండియాతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుంది. అధునాతన పరిజ్ఞానంతో సర్వే చేపడుతున్నాం. కచ్చితమైన రికార్డులను తయారు చేసి ప్రజలకు అందిస్తాం. మొదటి విడతలో 5000, రెండో విడతలో 6500, మూడో విడతలో 5500 గ్రామాల్లో మూడు విడతలుగా చేపట్టి 2023 ఆగస్టు వరకు పూర్తిచేసేలా ఈ కార్యక్రమం రూపకల్పన చేశాం. 

వ్యవసాయ, వ్యవసాయేతర భూములను సర్వే చేస్తాం. మన రాష్ట్రంలో రైతులకు, భూయజమానులకు వివాదాలు లేని కచ్చితమైన హక్కులు కల్పించేందుకు భూ బదిలీలు, రికార్డుల నిర్వహణ, పారదర్శకతతో శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో భూముల రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రీసర్వే పూర్తయితే గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక భూ సమస్యలు పరిష్కారమై.. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని తెలియజేస్తున్నా’ అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top