శ్రీకాకుళం: మహిళల ఆర్థిక ప్రగతికి నాంది వైయస్ఆర్ ఆసరా పథకం అని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ధర్మాన ప్రసాదరావు అన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఆ రోజు బ్యాంకులకు డ్వాక్రా సంఘాలు బకాయి పడ్డ రుణాలను నాలుగు విడతలుగా తీర్చేందుకు సీఎం నిర్ణయించారని, ఇప్పటికే మూడు విడతల్లో చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. వైయస్ఆర్ ఆసరా పథకం మూడో విడత వారోత్సవాలు శ్రీకాకుళం మండలం కిల్లిపాలెంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మాన మాట్లాడుతూ.. బాధ్యత గల ఇల్లాల్లికి అన్ని హక్కులూ కల్పించాలి అన్న ఉద్దేశంతోనే జగన్ మోహన్ రెడ్డి అన్ని పథకాలనూ వారికే వర్తింపజేస్తున్నారు. ఆ విధంగా ఇల్లాలి గౌరవం రెట్టింపు చేస్తున్నారు. 2019 ముందు వరకూ పాదయాత్ర చేసి మన కష్టాలను తెలుసుకున్నారు కనుక వైయస్ జగన్ ఇన్ని పథకాలు సమర్థంగా అమలు చేయగలుగుతున్నారు. మగువల ఆర్థిక స్వావలంబనకు కారణం అవుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్ జగన్ కు ఇటువంటి పథకాలు అమలు చేసేందుకు వీలు కలిగింది అంటే అందుకు కారణం మీరే, మా లాంటివారికి అధికారం ఇచ్చే అధికారం మీకే ఉంది. ఆ విషయం గ్రహించండి. మీరు మద్దతు ఇస్తేనే ఆ రోజు వైయస్ జగన్ అఖండ మెజార్టీతో గెలవగలిగారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అందుకు ప్రతిఫలంగానే ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు వీలు కలిగిందని మంత్రి ధర్మాన చెప్పారు. అధికారం ద్వారా దక్కిన సంపదను మీ లాంటి సోదరీమణులకు అందిస్తూ ఉన్నారు. మీ ఉన్నతికి కారణం అయ్యే విధంగా ఆ రోజు బకాయిలు ఉన్న డ్వాక్రా రుణాలు తీర్చేందుకు ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మూడు విడతల్లో బకాయిల చెల్లింపు కూడా పూర్తయిన సంగతి మీ అందరికీ తెలిసిందే అన్నారు. స్త్రీ గౌరవాన్ని పెంపొందించే విధంగా పని చేసే ప్రభుత్వానికి అండగా లేకపోతే ఇకపై పథకాలు అందవు. ఇలానే గతంలో చంద్రబాబు కొన్ని మాటలు చెప్పారు కానీ ఆయన మాట నిలబెట్టు కోలేదు. కానీ వైయస్ జగన్ మాత్రం ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాలను కట్టేందుకు, అలానే డ్వాక్రా రుణాల చెల్లింపునకూ ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్నారు. అందుకే మీరంతా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. మన కుటుంబాలను బాగు చేసుకునే క్రమంలో మరోసారి ఆలోచించండి. సంక్షేమ పథకాల అమలులో ఎంతో గొప్ప భావన ఉంది. మీ పిల్లలు బాగా చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్న వైయస్ జగన్ ను ఉద్దేశించి కొందరు విపక్ష నాయకులు అవాకులూ చవాకులూ మాట్లాడుతున్నారు. ఇదెంత మాత్రం తగదు. అలానే విద్య, వైద్యం విషయమై ఇతర మౌలిక వసతుల కల్పన విషయమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ కృషి చేస్తూ ఉన్నాం. అలానే పరిపాలన అన్నది చెంతకే వచ్చింది. అలానే మీ ఊరి బడి బాగుబడింది. ఇవన్నీ ఎలా వచ్చాయి. వీటిని మీరు గుర్తించారా ? వెల్ నెస్ సెంటర్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ మీకు ఏ విధంగా వచ్చాయి అన్నవి గుర్తించారా ? ఏదేమయినా సినిమాలు వేరు జీవితం వేరు .. మీ జీవితాలను ఏ విధంగా ఎవరు ప్రభావితం చేస్తున్నారు. మీ కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏది ? వాటిని నడిపిస్తున్న నాయకులు ఎవరు ? ఇవన్నీ ఆలోచించి పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, పిడి డిఅర్డిఎ విద్య సాగర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మలు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకట రత్నం, ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాస్, మజిమున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, ఎఎంసి ఛైర్మన్ ముకళ్ల తాత బాబు, ఎచ్చేర్ల సూరిబాబు, జెడ్పీటీసీ రుప్పా దివ్య, చింతాడ మంజుల, ముకళ్ల సుగుణ, కామేశ్వరి, అంబటి శ్రీనివాస్ రావు, చల్లా రవి కుమార్, చిట్టి జనార్ధన రావు, గంగు నరేంద్ర, శిమ్మ రాజశేఖర్, గేదల చగలరావు, తంగి శ్రీపతి, సురాడ సూర్యం తదితరులు పాల్గొన్నారు.