ఎల్లుండి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చింతపల్లి పర్యటన

 
తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎల్లుండి (21.12.2023)  అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ప‌ర్య‌టించ‌నున్నారు. 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం బహిరంగ సభ

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులతో మాట్లాడిన అనంతరం ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు

Back to Top