గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది..   

హౌజ్‌ కమిటీ  చైర్మన్‌ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి

 అమరావతి: పెగాసెస్‌, ఫోన్‌ ట్యాపింగ్‌పై హౌజ్‌ కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. చైర్మన్‌ భూమన  క‌రుణాక‌ర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హౌస్ కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. హోం, ఐటీశాఖల నుంచి హౌజ్‌ కమిటీ సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. 2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేటు భద్రతకు ముప్పు వాటిల్లే  చర్యలు  తీసుకుందని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను ఉంచి ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. 

గత ప్రభుత్వం దుర్మార్గపు చర్య‌లు తీసుకుందని మండిపడ్డారు. కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ధి పొందినట్లు స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలో డేటా చోరీ జరిగిందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసిందన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిందని విమర్శించారు. డేటా చోరీ జరిగిందన్న భూమన కరుణాకర్‌రెడ్డి అవసరమైతే కొందరిని హౌస్‌ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు.

Back to Top