సీఎస్ఐ చ‌ర్చిలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

పులివెందుల‌:  ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్‌ జిల్లా కడప జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. పులివెందుల‌లోని సీఎస్ఐ చ‌ర్చిలో కొద్దిసేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంద‌డంతో చ‌ర్చి పాస్ట‌ర్లు వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశ్వీర‌దించారు. ఇవాళ ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం  క‌డ‌ప‌ల‌ పెద్ద దర్గాను   దర్శించుకొని చాదర్‌ను  సమర్పించారు.  అనంతరం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైయ‌స్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
 

తాజా ఫోటోలు

Back to Top