కర్నూలు చేరుకున్న సిఆర్‌ఫీఎఫ్ ర్యాలీ

క‌ర్నూలు: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అయిన శుభసందర్భంగా దేశ పౌరుల్లో దేశ సమగ్రత, ఐక్యత మరింతగా పెంపొందించటం కోసం గత ఆగస్టు 22న "ఆజాది కా అమృత్ మహోత్సవ్" పేరుతో తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన సిఆర్‌ఫీఎఫ్‌ జవాన్ల సైకిల్ ర్యాలీ సోమ‌వారం కర్నూలుకు చేరుకుంది. రోజుకు 90 కిలోమీటర్ల చొప్పున దాదాపు 2800 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ ర్యాలీ అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడున ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ముగియనున్నది.

ఈ శుభసందర్బంగా కర్నూలు పోలీసు యంత్రాంగం, ద ఎతిన స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. వెయ్యి మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శనతో పాటు సాంస్కృతిక వంటి కార్యక్రమాలు, ముఖ్య అతిథులు, విద్యార్థుల మధ్య సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య, శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి  , హఫీజ్ ఖాన్, సుధాకర్,  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, రేంజ్ డిఐజి రఘురామి రెడ్డి, ఎస్పి సుధీర్ రెడ్డి, కర్నూలు కమిషనర్ డి.కే బాలాజీ  , అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , సిఆర్పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్ , జవాన్ల సైకిల్ టీమ్ లీడర్ డిప్యూటీ కమాండెంట్ రమేష్ , అసిస్టెంట్ కమాండెంట్ ఎన్.వి.రావు, కులదీప్, ద ఎటిన స్కూల్ యాజమాన్యం ఆనుప్, సేట్కూరు సిఈఓ నాగరాజు నాయుడు, డిఎస్పిలు మహబూబ్ బాషా, మహేష్, సిఐలు, ఎస్ఐలు, సీఆర్పీఎఫ్ జవాన్లు కార్యక్రమంలో ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top