కోవిడ్‌ టెస్ట్‌ల‌ సంఖ్య ఐదు వేలకు పెంపు

హోమ్‌ ఐసొలేషన్‌ ద్వారా వైద్యం అం

 మంత్రి అవంతి శ్రీనివాసరావు

 విశాఖపట్నం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో కోవిడ్ టెస్టుల సంఖ్య 3 వేల నుంచి 5 వేల‌కు పెంచిన‌ట్లు మంత్రి అవంతి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. సోమ‌వారం విశాఖ‌లో  కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసింది.  ఈ సంద‌ర్బంగా మంత్రి  మీడియాతో మాట్లాడుతూ..  క‌రోనా పాజిటివ్ పేషేంట్ల‌కు హోమ్‌ ఐసొలేషన్‌ ద్వారా వైద్యం అందించాలని భావిస్తున్నామ‌ని తెలిపారు.  ఐసీఎంఆర్‌ అనుమతితో మరికొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి ఇస్తాము. అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బందిని నియమిస్తున్నాము. మానవతా థృక్పథంతో ఉన్న వైద్యసిబ్బంది కోవిడ్‌ సేవలు అందించడానికి ముందుకు రావాల‌ని కోరారు.  గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వైద్యవిభాగంలో లోపాలు ఉన్నాయి. వాటిన్నిటినీ సరిదిద్దుకుంటూ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.    జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదు. ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ను మెడికల్‌ ఆక్సిజన్‌గా మారుస్తున్నాము. జిల్లాలో అదనంగా మొత్తం 22 ఆస్సత్రులు కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించామ‌ని, ఇప్పటికే 4వేల బెడ్స్‌ ఉన్నాయి. వీటిని 7వేల వరకు పెంచనున్నట్లు  మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌‌ వెల్లడించారు

Back to Top