పెరిగిన కరోనా రికవరీ రేట్‌

క్టీవ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ కేసులు ఎక్కువ

అమరావతి: రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం పెరిగింది. యాక్టివ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7409 శాంపిల్స్‌ను పరీక్షించగా కొత్తగా 38 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 73 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2018కి చేరగా, ఇప్పటివరకు 998 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 45 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 975 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.  అనంతపురం జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో 9 (వీరిలో 8 మంది తమిళనాడు నుంచి వచ్చిన వారు), గుంటూరు జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 

తాజా వీడియోలు

Back to Top