ఏబీఎన్ కథనాలపై పులివెందులలో ఫిర్యాదు 

కేసు నమోదు చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ డిమాండ్  

వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల మనోభావాలు దెబ్బతినేలా, సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్యకరంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు సంబంధిత ప్రతినిధులపై కేసు నమోదు చేయాలని కోరుతూ పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అసత్యాలు మరియు అభ్యంతరకర కథనాలను ప్రచారం చేయకూడదని నేతలు పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


 

 

Back to Top