'ఛలో భీమవరం` త‌ర‌లిరండి

పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి 

దెంద‌లూరు: ఆక్వా రైతులకు సంఘీభావంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న భీమవరం పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో నిర్వహించనున్న "ఛలో భీమవరం  " కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏలూరు జిల్లా దెందులూరు మాజీ శాసనసభ్యుడు కొఠారు అబ్బయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆక్వా రైతులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు వైయస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారని తెలిపారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "ఛలో భీమవరం" కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 

Back to Top