‘శాశ్వత భూహక్కు–భూరక్ష’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ పథకంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే, సర్వే రాళ్ల ఏర్పాటు, సర్వే పూర్తయిన చోట గ్రామస్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటు, ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు వంటి అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న‌ ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top