సీఎం వైయ‌స్ జగన్ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుంది 

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుంద‌ని విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ‌మ్మ దేవస్థాన అభివృద్ధికి రూ.80 కోట్లలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్ కి దక్కింద‌ని స్ప‌ష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమం 284 సచివాలయం 64 వ డివిజన్ బర్మా కాలనీ పరిధిలో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి జీ హిందూ దేవాలయాల గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నార‌ని చెప్పారు. స్వామీజీలు సమాజాన్ని సన్మార్గంలో పెట్టాలని హిత‌వు ప‌లికారు. అసత్యాలను ప్రచారం చేయడం సరికాద‌న్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేయటం సరికాద‌న్నారు. సీఎం వైయ‌స్ జగన్ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందని స్ప‌ష్టం చేశారు. అమ్మవారి దేవస్థాన అభివృద్ధికి రూ.80 కోట్లలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్ కి దక్కిందని గుర్తు చేశారు. పుష్క‌రాల్లో బిజెపి - టిడిపి ఎంత అవినీతి చేశాయో పరిపూర్ణానంద స్వామి సమాధానం చెప్పాల‌న్నారు. పుష్కరాల్లో అమాయక ప్రజలు చనిపోతే  పరిపూర్ణానంద స్వామి ఎందుకు మాట్లాడలేద‌ని ప్ర‌శ్నించారు. పరిపూర్ణానంద స్వామీజీ హిందువులని రెచ్చగొట్టడం సరికాద‌ని సూచించారు. టిడిపి ప్రభుత్వంలో విజయవాడ నగరంలో హిందూ దేవాలయాలను కూలగొట్టారు. పరిపూర్ణానంద స్వామి చెప్పినంత మాత్రాన హిందువులందరూ వైయ‌స్ఆర్‌ సిపి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని మ‌ల్లాది విష్ణు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో  స్థానిక డివిజన్ కార్పొరేటర్ యర్రగర్ల తిరుపతమ్మ, శ్రీరాములు, జిల్లెల్ల శివ ,  పందిరి వాసు, ఇస్మాయిల్, మేడా రమేష్,  ఎల్లపు అనిల్, డివిజన్ సోషల్ మీడియా కన్వీన మాతా మహేష్ బత్తుల శంకర్  నారాయణ,  కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top