నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయ‌స్ జగన్‌

తాడేపల్లి: రేపు(సోమవారం) నూతన సంవత్సరం 2024లోకి అడుగుపెడుతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు వారికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని సీఎం వైయ‌స్ జగన్‌ కోరుకున్నారు. 

కాగా, సీఎం వైయ‌స్ జగన్‌..‘రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలి. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top