రేపు సీఎం వైయ‌స్ జగన్‌...కృష్ణా జిల్లా గుడివాడ పర్యటన

కృష్ణా జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం కృష్ణా జిల్లా గుడివాడ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మల్లాయపాలెం చేరుకుంటారు. అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top