‘ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్చలు’

 వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 
 

తాడేపల్లి:  పీఆర్సీ అంశానికి సంబంధించి ఈరోజు (మంగళవారం) కూడా సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మరోసారి చర్చ జరిగినట్లు   వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫైనాన్స్‌ అధికారులు కొన్ని ప్రతిపాదనలను సీఎం వైయ‌స్ జగన్‌ ముందు ఉంచారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆలోచిస్తున్నారన్నారు. ఫిట్‌మెంట్‌, డీఏలు అన్నీ చర్చిస్తున్నారని,  ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టే కొంచెం ఆలస్యమవుతోందని సజ్జల తెలిపారు. త్వరలోనే పీఆర్సీపై సీఎం ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. 
 

Back to Top