కాసేపట్లో తిరుపతికి బయల్దేరనున్న సీఎం

తాడేపల్లి: స్వర్నిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో తిరుపతి బయల్దేరనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బ‌య‌ల్దేర‌నున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి చెన్నారెడ్డి హౌసింగ్‌ కాలనీలో ఉండే ఇండో–పాక్‌ యుద్ధవీరుడు వేణుగోపాల్ నివాసానికి సీఎం చేరుకుంటారు. యుద్ధ‌వీరుడు వేణుగోపాల్‌ను స‌త్క‌రించి.. వారి ఇంటి వ‌ద్ద‌నే ఒక మొక్క‌ను నాట‌నున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరుపతి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే స్వర్నిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ హాజరవుతారు. 6:40 గంటలకు సభను ఉద్దేశించిన సీఎం ప్రసంగిస్తారు. 

Back to Top