నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

  తూర్పు గోదావ‌రి:   నిడ‌ద‌వోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని  నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.   బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం వైయ‌స్‌ జగన్‌.. వివాహ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి నిడదవోలకు బయల్దేరిన సీఎం వైయ‌స్ జగన్‌కు సబ్బ రాజుపేట  హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గం.లకు వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. వధూవరులను ఆశీర్వదించారు. హోం మంత్రి  తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మర్గాని భరత్ , పలువురు ప్రజా ప్రతినిధులు వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొన్నారు.

 

\

Back to Top