ఈనెల 11న గుంటూరుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గుంటూరు: ఈనెల 11వ తేదీన గుంటూరు మెడికల్ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో జరగనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి వేడుకల‌కు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ఈ సందర్భంగా కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను హోం మంత్రి మేకతోటి సుచరిత, వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ప‌రిశీలించారు. వేదిక‌, కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌కు సంబంధించి విష‌యాల‌పై అధికారుల‌తో చ‌ర్చించారు. 

తాజా ఫోటోలు

Back to Top