నేడు, రేపు అన్న‌మ‌య్య, వైయ‌స్ఆర్‌ జిల్లాల్లో సీఎం ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు వైయ‌స్ఆర్ క‌డ‌ప‌, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉద‌యం 10 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి అన్నమయ్య జిల్లా రాయచోటి చేరుకుంటారు. రాయ‌చోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొంటారు. అనంత‌రం మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలోనూ పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించ‌నున్నారు. 

రాయ‌చోటి నుంచి బ‌య‌ల్దేరి పులివెందుల చేరుకుంటారు. పులివెందుల‌లో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంత‌రం పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంత‌రం ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్క‌డి నుంచి ఆదిత్య బిర్లా యూనిట్‌ను విజిట్ చేస్తారు. ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. అక్కడినుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.  

10వ తేదీ సీఎం షెడ్యూల్‌..
ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్‌.కే.వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రారంభిస్తారు. అనంత‌రం ఎకో పార్క్‌ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఆ త‌ర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top