1న ఇంటింటికీ రేష‌న్ బియ్యం పంపిణీ ప్రారంభం

అనంత‌పురం జిల్లాలో ప్రారంభించ‌నున్న‌ సీఎం వైయ‌స్‌ జగన్‌
 

అనంతపురం : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ కోసం అందజేస్తున్న వాహనాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించ‌నున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 1న అనంతపురం న‌గ‌రంలో ఇంటింటికీ రేష‌న్ బియ్యం పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు అనంత‌పురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.  1వ తేదీన ఉదయం 10 గంటలకు నగరంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.  ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్‌ గంధం చంద్రుడు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.  

Back to Top