తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ``అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములుగారి త్యాగ ఫలం, ఎంతో మంది పోరాట ఫలితంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నేడు వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనం బలపడుతూ ఈ దేశాన్ని మరింత బలపరిచేందుకు ఎన్నో అడుగులు ముందుకు వేస్తున్నాం. దేశ అభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నేడు వైయస్ఆర్ అచీవ్‌మెంట్, వైయస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందుకుంటున్న అందరికీ అభినందనలు`` తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. https://x.com/ysjagan/status/1719588182566846523?s=20