తాడేపల్లి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైయస్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. నాన్నా.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.