విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే

కార్యకర్తల గురించి సీఎం వైయ‌స్ జగన్ ట్వీట్

తాడేప‌ల్లి: దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమేనన్న మాట రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోంద‌ని పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల గురించి సీఎం వైయ‌స్ జగన్ ట్వీట్ చేశారు.
ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుంది
నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్న మాట రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోంది.
ఇప్పుడు మన కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ధైర్యంగా చెప్పే పరిస్థితి  ఉంది
రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు మన ప్రభుత్వంలో మంచి చేయగలిగామని చెప్పేందుకు గర్వపడుతున్నాను.

Back to Top